మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ధృవ'లో విలన్ పాత్రని ఎవ్వరూ మర్చిపోలేం. ఆయనే అరవింద్ స్వామి. ఏరి కోరి ఆయన్నే ఈ సినిమాకి విలన్‌గా తీసుకొచ్చారు. తమిళ 'తనీఒరువన్'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం అందుకుంది.
హ్యాండ్‌సమ్ హీరోగా సుపరిచితుడైన అరవింద్‌స్వామి లాంగ్ గ్యాప్ తర్వాత విలన్‌గా దర్శనమివ్వడం, అది కూడా స్ట్రాంగెస్ట్ విలన్ పాత్ర కావడంతో ఆ పాత్రకు చాలా పేరొచ్చింది. ఇక తర్వాత అరవింద్‌స్వామి తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళంలో మాత్రం హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌లో దున్నేస్తున్నాడు. వరుసపెట్టి ఆఫర్లు ఆయన్ని వరించాయి. ఆయన నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ తరుణంలో ఆయన దర్శకుడిగా అవతారమెత్తబోతున్నాడనే వార్త వెలుగులోకి వచ్చింది. అరవింద్‌స్వామి గతంలోనే చెప్పారు తనకు దర్వకత్వంపై ఇంట్రెస్ట్ ఉందని. అయితే వరుస సినిమాల కారణంగా ఆ సంకల్పం నెరవేర్చుకునేందుకు ఇంత టైమ్ పట్టిందట. అయితే ఎట్టకేలకు కథ ప్రిపేర్ చేశారట. త్వరలోనే అరవింద్‌స్వామి దర్శకత్వంలో తమిళంలో సినిమా పట్టాలెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా వివరాలు తెలియచేస్తారట.
ఇకపోతే దర్శకుడిగా మారిన తర్వాత అరవింద్‌స్వామి సినిమాల్లో నటిస్తారా? అంటే ఏమో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఫుల్ లెంగ్త్ రోల్స్ కాకుండా, ఇంపార్టెంట్ రోల్స్‌లో అరవింద్‌స్వామి నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఆయన నటించలేనని చెప్పేశారు. అందుకు కారణం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని ఆయన అభిప్రాయం.