'అరవింత సమేత'కి అతి జాగ్రత్త

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత' సినిమాకి సంబంధించి దర్శక నిర్మాతలు అతి జాగ్రత్తలు పాటిస్తున్నట్లే కన్పిస్తోంది. సినిమా టైటిల్‌ చాలా కూల్‌గా పెట్టారుగానీ, ఇంతవరకు 'కూల్‌'గా వుండే ప్రోమో ఏదీ వదల్లేదు. వున్నంతలో ఒక్క, 'అనగనగా' ఆడియో సింగిల్‌ మాత్రమే కూల్‌గా వుందంతే. 

టీజర్‌, ట్రైలర్‌.. రెండూ సీరియస్‌ టోన్‌లోనే వున్నాయి. ట్రైలర్‌లో కాస్తంత ఫన్‌ చూపించే ప్రయత్నం చేసినా, అది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో సర్వత్రా సినిమాపై కొంత అనుమానం అయితే వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ రోజు సాయంత్రం 'అనగనగా' సాంగ్‌ ప్రోమోని విడుదల చేస్తున్నారు. ఈ ప్రోమోతో సినిమాపై ఇప్పటిదాకా వున్న ఆలోచనలు అందరిలోనూ మారిపోవడం ఖాయమని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ పాటలో సూపర్బ్‌ డాన్స్‌ మూమెంట్స్‌తో అలరించబోతున్నాడట. సినిమాలో పాటలు తక్కువ కావడం, డాన్స్‌ వేసే ఛాన్స్‌ కూడా తక్కువ కావడంతో, కుదిరిన కొద్ది సందర్భాల్లోనే డాన్సులు ఇరగదీసేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. ఇంకో వారం రోజుల్లో సినిమా విడుదలవుతుంది గనుక, ప్రమోషన్స్‌ పరుగులు పెట్టించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. 

దానికి తగ్గట్టే మొత్తం ప్లానింగ్‌ జరిగిపోయింది. సాంగ్‌ ప్రోమో మాత్రమే కాదు, ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌ కొన్నిటిని జత చేసి ఓ ప్రోమో విడుదల చేయబోతున్నారట. వాటిల్లో త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌లకు కొదవే వుండదన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అందిస్తున్న సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS