తొలి రోజు, రెండో రోజు పలు చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తోన్న 'అరవింద సమేత', శాటిలైట్ హక్కుల పరంగా సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువైందంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుమారు పాతిక కోట్లు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించారనీ, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఛానల్స్ నిర్వహిస్తోన్న ఓ సంస్థ ఆ రైట్స్‌ని సొంతం చేసుకుందనీ తెలుస్తోంది.
సినిమాకి హిట్ టాక్ వస్తే చాలు, శాటిలైట్ రైట్స్ అమాంతం ఆకాశాన్నంటేస్తున్నాయి. కొన్ని సినిమాలకు రిలీజ్‌కి ముందే భారీ ఆఫర్స్‌తో శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడుతున్న సందర్భాల్ని చూస్తున్నాం. అలా 'అరవింద సమేత'కి ముందే శాటిలైట్ రైట్స్ గురించిన గాసిప్స్ తెరపైకి రాగా, ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఆ గాసిప్స్‌ని మించి.. భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడం విశేషమే కదా.
ఇదిలా ఉంటే, 'అరవింద సమేత' వసూళ్ళ సునామీ కొనసాగుతూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఈ రోజు మార్నింగ్ షో, మ్యాట్నీ షో ఫుల్ అయిపోగా, మిగతా షోలకూ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. సోమవారం వరకు చాలా చోట్ల టిక్కెట్లు దొరకని పరిస్థితి. కొన్ని చోట్ల టిక్కెట్ రేట్లను థియేటర్ల యాజమాన్యాలు ఫ్లాట్ రేట్ అంటూ బారీ మొత్తాలకు అమ్ముకుంటున్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి. కాగా, 'అరవింద సమేత' విజయోత్సవ సభను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎమోషనల్‌గా సాగిన నేపథ్యంలో, మంచి జోష్‌తో విజయోత్సవ సభ నిర్వహించాలన్న డిమాండ్ అభిమానులనుంచీ వస్తోంది.