ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ బయోపిక్ గురించిన చర్చనే ప్రధానంగా నడుస్తున్నది. ముందుగా ఒక సినిమాలోనే ఆయన జీవితాన్ని చూపిస్తారు అని అనుకున్న ప్రేక్షకులకి బయోపిక్ ని రెండు భాగాల్లో చూపించబోతున్నారు అని తెలిసి అందరూ అవ్వాకయ్యారు.
ఇదిలావుండగా అప్పుడెప్పుడో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నాను అంటూ హడావుడి చేసిన ఆర్జీవీ ఒక్కసారిగా నిన్నటి నుండి ఈ సినిమా గురించిన ట్వీట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే ఈ నెల 18న తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ముహూర్తం అని త్వరలోనే ఈ చిత్రం విడుదల చేస్తాను అని ప్రకటించేశాడు.
దీనితో ఈ సినిమాలో ఏదైనా తప్పులు, కట్టు కథలు చూపిస్తే మాత్రం తాను ఈ చిత్రం విడుదలకి అస్సలు ఒప్పుకోను అని ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి ప్రకటించారు. తన పేరుతో రాబోతున్న సినిమాలో ఎటువంటి కల్పితాలకి చోటు ఇవ్వకూడదు అన్న కారణంగానే ఈ సినిమా మొదలుపెట్టక ముందే అన్ని విషయాలకి సంబంధించి తనని సంప్రదించాలి అని పేర్కొంది.
వర్మ ఈ ప్రకటన పైన ఎటువంటి ప్రకటన చేస్తాడో వేచి చూడాలి.