బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనమనే చెప్పాలి.
ఇక ఈ షో ఆఖరి వారానికి చేరుకుంది, దీనితో మిగిలిన కంటేస్టంట్స్ లో ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నది.
నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ, ఆదర్శ్ సేఫ్ జోన్ కి వెళ్ళిపోయారంటూ ఎన్టీఆర్ చెప్పేయడంతో ఇప్పుడు అంది దృష్టి అర్చన,దీక్షాల పై పడింది. ఇప్పటికే అర్చన గత ఆరు వారాలుగా ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటూ ఇక్కడివరకు చేరుకుంది. అలాగే దీక్షా కూడా అయిదు సార్లు ఎలిమినేషన్ గండం నుండి బయటపడింది.
మరి ఈరోజున కచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోనుండగా ఆ వెళ్ళేది ఎవరు అనేది ఈరోజు ఎపిసోడ్ పైన ఆసక్తి పెంచుతున్నది.
చూద్దాం.. ఈ ఇద్దరి భామల్లో ఎవరు సేఫ్ జోన్ లో ఉండబోతున్నారో..