హీరోగా నిలదొక్కుకునేందుకు సునీల్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొకటిగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఉంగరాల రాంబాబు చిత్రం కూడా అదే కోవలోకి చెందినది.
అయితే ఈ చిత్ర ప్రొమోషన్స్ సందర్భంగా తాను మళ్ళీ ఫుల్ టైం కమెడియన్ గా రంగప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే ఇంతక్రితం కూడా ఇటువంటి ప్రకటనే చేసినా ఎందుకో ఆ దిశగా అడుగులు వేయలేదు.
కాని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా సునీల్ ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిందే. అందుకనే కమెడియన్ గా మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిపాడు. అయితే ఆ రీ-ఎంట్రీ కూడా చిరంజీవి చేయబోయే సైరా నరసింహా రెడ్డి చిత్రంతో అని ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మరి.. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..