'అర్జున్‌రెడ్డి' సినిమాతో ప్రీతిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ షాలినీ పాండే, తొలి సినిమాకే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వచ్చిన '118' సినిమా షాలినీని నటిగా నిలబెట్టింది. చిన్న పాత్రే అయినా 'ఎన్టీఆర్' బయోపిక్‌లోనూ తనదైన శైలి ప్రతిభ చూపించింది. లేటెస్ట్‌గా రాజ్‌తరుణ్‌తో 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా రిజల్ట్ అంతగా కలిసి రాలేదు. అయితే, షాలినీ పాండే నటనకు మంచి మార్కులు పడ్డాయి. సన్నివేశంలో బలం లేకపోయినా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, చూపించిన హావ భావాలు అందర్నీ కట్టి పడేస్తున్నాయి.
నిజానికి రాజ్ తరుణ్ మంచి నటుడే. కానీ, ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ పరంగా రాజ్ తరుణ్ బాగా డల్‌గా కనిపించాడు. దాంతో రాజ్ తరుణ్‌ని షాలినీ పాండే బాగా డామినేట్ చేసేసిందనే ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ మించి ఎలాంటి బలమైన పాత్రలోనైనా తనను తాను డెవలప్ చేసుకునే దిశగా షాలినీ మంచి నటన కనబరుస్తోందని అంటున్నారు. దర్శకుడిలో ప్రతిభ ఉంటే, షాలినీలోని నటి మరింత బాగా ఎలివేట్ అవుతుందని ఆమెపై రీసెర్చ్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్.
సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా షాలినీకి వస్తున్న పోజిటివ్ రెస్పాన్స్‌తో ఆమెకు మరిన్ని మంచి పాత్రలు రావడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షాలినీ పాండే బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. అనుష్క నటిస్తోన్న 'నిశ్శబ్ధం' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.