బిగ్‌బాస్‌కి సంబంధించినంతవరకు ఇప్పటిదాకా నడిచిన ఎపిసోడ్స్‌తో పోల్చితే, దయ్యాల ఎపిసోడ్ ఒకింత హిలేరియస్‌గా సాగిందనే చెప్పుకోవచ్చు. జబర్దస్త్‌ని మించిన కామెడీ ఇది. అదేంటీ, బీభత్సంగా భయపెట్టేస్తారనుకుంటే.. కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించేయడమేంటి.? అంటే, అదంతే. అరియానా గ్లోరీ చాలా భయపడింది. సోహెల్ అయితే, ఇంకా ఎక్కువ భయపడ్డాడు.
కానీ, ఇదంతా నిజం కాదు. అవును, ఇద్దరూ భయపడినట్లు నటించడంలో సక్సెస్ అయ్యారు. తద్వారా బుల్లితెర వీక్షకులకు బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. అఖిల్ కూడా తనవంతుగా కష్టపడ్డాడు. అయితే, ఈ ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. భయపడలేదు, చాలా ధైర్యంగా కనిపించింది దెయ్యాల కోటలో. అసలు, దీన్నొక భయం గొలిపే విషయంగానే మోనాల్ గజ్జర్ భావించకపోవడం గమనార్హం.
పైగా, సోలోగానే ఆమె దెయ్యాల గదిలోకి అడుగు పెట్టింది. వెళ్ళింది, వచ్చింది.. టాస్క్ పూర్తి చేసింది. సోహెల్, అఖిల్.. ఆ గదిలోకి వెళ్ళాక, వారిని ఉద్దేశించి 'కథ వేరే ఉంటది..' అంటూ మోనాల్ గజ్జర్ చేసిన ఫన్ అంతా ఇంతా కాదు. ఓవరాల్‌గా, నిన్నటి ఎపిసోడ్.. అదే సమయంలో ఇంకో ఛానల్‌లో ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్‌ని మించి కాస్సేపు ఫన్ సృష్టించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కామెడీ కోసమే అయితే ఇలాంటి రియాల్టీ షోలు అవసరమా.? అన్న చర్చ బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో నడుస్తోందనుకోండి. అది వేరే సంగతి.