రాజమౌళి నుంచి వస్తున్న మరో భారీ చిత్రం `ఆర్.ఆర్.ఆర్`. దాదాపు 300కోట్ల వ్యయంతో రూపొందుతున్న చిత్రం ఇది. దానికి తగ్గట్టే... రాజమౌళి సరికొత్త మార్కెట్ వ్యూహాలను రచిస్తున్నాడు. తన సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో, బిజినెస్ ఎలా పెంచుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. బాహుబలి విషయంలో.. రాజమౌళి స్ట్రాటజీ బాగా పనికొచ్చింది. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్`కీ అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు.
బాలీవుడ్ లో హైప్ కోసం అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహాయం పొందిన రాజమౌళి.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడని టాక్. ఈ సినిమా కథని పరిచయం చేసేందుకు.. చిరంజీవి సహాయం తీసుకోబోతున్నాడట. చిరు వాయిస్ ఓవర్ తో ఈ కథ ప్రారంభం అవుతుందని సమాచారం అందుతోంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల కోసమూ ఇదే పద్ధతి పాటించబోతున్నాడు. అక్కడి సూపర్ స్టార్స్ తో.. వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నాడట. ట్రైలర్, టీజర్‌లలో కూడా వేరే హీరోల గొంతులు ఉపయోగించుకుంటాడని సమాచారం. మొత్తానికి... రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ నైపుణ్యాలను ఈ సినిమా కోసం వాడుకోబోతున్నాడన్నమా