పవన్ కళ్యాణ్ తో ‘కోబలి’ ఉంటుంది

By iQlikMovies - May 27, 2018 - 14:11 PM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కలయికలో కోబలి అనే చిత్రం రానుంది అన్న ప్రచారం గాథలో బాగా వినపడింది. అయితే తరువాత కాలంలో ఆ సినిమా మరుగునపడిపోయింది.

ఇక ఇన్నిరోజులకి ఆ చిత్రం గురించి దర్శకుడు త్రివిక్రమ్ స్పందించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి- అసలు రాయలసీమలో ఫ్యాక్షన్ ఎలా మొదలైంది, అది కాలక్రమంలో ఎలా పెరుగుతూ వచ్చింది అనేదాని పైన పరిశోధన చేసిన త్రివిక్రమ్, ఆ నేపధ్యంలో ఒక సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిందట.

పాత కాలంలో ప్రత్యర్ధుల పైన దాడి చేసే సమయంలో వాడుకలోకి వచ్చిన పదమే ‘కోబలి’ అట. ఇక పాటలు లేకుండా ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసిన త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ డేట్ల విషయమై ఇబ్బందులు తలెత్తాయట. ఎందుకంటే ఈ సినిమా 2014 ఎన్నికల సమయంలో చేయాల్సి రావడమే అట.

అయితే భవిష్యత్తులో ఈ సినిమా చేసేది లేనిది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉందట. ఆయన 2019 సాధారణ ఎన్నికల తరువాత సినిమాలు చేయాలనుకుంటే ఈ చిత్రం చేస్తాము అని తెలిపాడు.

ఈ వివరణతో ‘కోబలి’ సినిమా పై నెలకొన్న అనుమానాలు, అపోహలు తొలిగిపోయాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS