యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' వసూళ్ల రేస్‌లో దూస్కెళ్లిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక వసూళ్లతో కనక వర్షం కురిపిస్తోన్న 'అర్జున్‌రెడ్డి', ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ దాటేసింది. ఓ చిన్న సినిమాకి ఈ విజయం అత్యంత అపురూపం. సాధారణంగా ఇలాంటి సినిమాలు ఓవర్‌సీస్‌లో అంత బాగా ఫేర్ చెయ్యవు. కానీ 'అర్జున్‌రెడ్డి' సత్తా చాటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. లిప్ కిస్ పోస్టర్ రేపిన వివాదం సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఎన్ని వివాదాలు తెచ్చిపెట్టినప్పటికీ, సినిమాకి అవన్నీ ప్లస్ పాయింట్సే అయ్యాయి. లిప్ లాక్స్, ఓవర్ కాన్ఫిడెంట్ డైలాగ్స్ సినిమాపై తొలి నుండీ అంచనాలు పెంచుకొస్తూనే ఉన్నాయి. ఆ అంచనాలని మించకుండానే అర్జున్ రెడ్డి తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. 'పెళ్లి చూపులు' సినిమాతో సైలెంట్‌గా హిట్ కొట్టిన 'అర్జున్‌రెడ్డి' సోరీ విజయ్ దేవరకొండ ఈ 'అర్జున్‌రెడ్డి'తో గట్టిగానే కొట్టేశాడు. అది ఎంతలా అంటే తన సొంత పేరైన విజయ్ దేవరకొండ పేరు అర్జున్‌రెడ్డిగా మారిపోయేంతగా..కాంట్రవర్సీలకే కాంట్రవర్సీ, సెన్సేషన్‌కే సెన్సేషన్ అయిన రామ్ గోపాల్ వర్మతో ప్రశంసలు అందుకున్నాడు మనోడు. ఏకంగా తెలంగాణా మెగాస్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశాడు రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండకి. త్వరలోనే రామ్ గోపాల్ వర్మతో విజయ్ దేవర కొండ హీరోగా సినిమా వచ్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.