అర్జున్ రెడ్డి- ఈ మధ్యకాలంలో ఈ చిత్రం సృష్టించినంత హంగామా మరే చిత్రం సృష్టించలేదు అన్నది నిర్వివాదాంశం.
రిలీజ్ అయిన మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తో అందరిని అలరించిన ఈ సినిమా విజయవంతంగా ఈ మధ్యనే 50రోజుల మార్కుని కూడా అందుకుంది. ఇక మొన్ననే అర్జున్ రెడ్డి డిజిటల్ వెర్షన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో మళ్ళీ ఈ చిత్రం మేనియా మొదలైందనే చెప్పాలి.
ఆరోజు ఉదయం నుండి రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని వీక్షించారు అని అనధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఇక హీరో విజయ్ కూడా ఈ సినిమా డిజిటల్ వెర్షన్ విడుదలైన తరువాత వివిధ ప్రాంతాల్లో ఎలా చూస్తున్నారు అన్న వీడియోలు తన పోస్ట్ ద్వారా తెలియచేస్తున్నాడు.
మొత్తానికి ఈ చిత్రం థియేటర్ల లోనే కాకుండా ఇప్పుడు ఇళ్ళలోని కంప్యూటర్స్ లో కూడా పెద్ద హంగామానే చేస్తున్నదనమాట.