సమంతా నుండి సమంతా అక్కినేనిగా మారిన తరువాత విడుదలైన మొదటి చిత్రమే సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఇక ఈ ఆనందంలో మీడియాతో ముచ్చటిచ్చిన సమంతా, ఈ చిత్రం విజయం సాధించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెబుతూ, ఇటువంటి పాత్ర చేయడానికి కారణం ఆ అంశం బాగా నచ్చడమే అని చెప్పింది. ఓంకార్ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాను అని తెలిపింది.
అలాగే పెళ్ళి తరువాత కూడా నటిగా కొనసాగడం పైన చాలా మందికి అపోహలు ఉన్నాయి అని తాను మాత్రం అవి పోగొట్టడానికే నటన కొనసాగిస్తాను అని తెలిపింది.
మొత్తానికి పెళ్ళి తరువాత నటనకు ఎటువంటి ఫుల్ స్టాప్ లేదని తేల్చి చెప్పేసింది ఈ అక్కినేని వారి కోడలు.