మళ్ళీ అర్జున్ రెడ్డి ప్రభంజనం ?

మరిన్ని వార్తలు

'అర్జున్ రెడ్డి' టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ. తోలి ప్రయత్నంలోనే సందీప్ వంగా అందరి ద్రుష్టిని ఆకర్షించాడు. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే తో తెరకెక్కించిన ఈ మూవీ  బాక్సాఫీస్ బాక్సులు బద్దలు గొట్టింది. అన్ని భాషల్లోను నేరుగా రిలీజ్ అవకుండా రీమేక్ చేశారు. అన్ని చోట్ల ఆడియన్స్ ని అలరించింది అర్జున్ రెడ్డి. చివరికి బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ గా తెరకెక్కి విజయం సాధించింది. 2017 ఆగస్టు 25న రిలీజైన అర్జున్ రెడ్డి మూవీ 50 కోట్ల వసూళ్లతో సందీప్, విజయ్ దేవరకొండ మార్కెట్ ని పెంచింది.


అర్జున్ రెడ్డితో స్టార్ హీరో అయిపోయాడు విజయ్, ప్రతి హీరో కెరియర్ కి టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా ఒకటుంటుంది. విజయ్ కి అలాంటి సినిమా అర్జున్ రెడ్డి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి ఏడేళ్లు అయిన సందర్భంగా విజయ్ ఒక పోస్టు పెట్టాడు. అర్జున్ రెడ్డి మూవీ మేకింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, 'అర్జున్ రెడ్డి సినిమా విడుదలై అప్పుడే ఏడేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని, గత ఏడాదే పూర్తి చేసినట్లు అనిపిస్తోందని, ఎన్నో విషయాలు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయని' షేర్ చేసుకున్నారు. 


అర్జున్ రెడ్డి 10 ఇయర్స్ యానివర్సరీకి ఫుల్ కట్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని సందీప్ ని విజయ్ రిక్వెస్ట్ చేశారు. అప్పట్లోనే ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేసినా సందీప్ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేస్తానని యూనిట్ కి మాటిచ్చారట. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మూవీ 10వ వార్షికోత్సవానికి ఫుల్ వెర్షన్ మూవీ రిలీజ్ చేయాలనీ, రిక్వెస్ట్ చేశారు. దీనితో ఇంకో మూడేళ్ళలో అర్జున్ రెడ్డి విశ్వరూపాన్ని చూడబోతున్నామన్న మాట అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS