ఏడాది తర్వాత ఇప్పుడు 'గీత గోవిందం' సినిమాతో హల్‌చల్ చేస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఏడాది ముందు 'అర్జున్‌రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ అయ్యాడీ యంగ్ హీరో. యూత్‌లో పిచ్చ పిచ్చగా క్రేజ్ సంపాదించేశాడు ఆ సినిమాతో. ఆ అర్జున్‌రెడ్డి ఓవర్సీస్‌లో సాధించిన వసూళ్లను 'గీత గోవిందం' తొలి వారంలోనే దాటేసిందిప్పుడు. 75 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిందిప్పటిదాకా.
అర్జున్‌రెడ్డి విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు సినిమా ట్రెండ్ మార్చేసింది ఆ సినిమా. హీరో అంటే రాముడు మంచి బాలుడు అన్నట్లుగానే ఉండాలి అని అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా హీరోయిజంకు కొత్త అర్ధం చెప్పాడీ అర్జున్‌రెడ్డి.
'రా' లవ్ స్టోరీస్‌కి అర్జున్‌రెడ్డి కొత్తగా శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఆ కోవలోనే 'ఆర్ ఎక్స్ 100' సంచలన హిట్ అందుకుంది. మరికొన్ని సినిమాలు మళ్లీ మళ్లీ అదే బాటలో రూపొందుతున్నాయి. ఏదేమైనా అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండను స్టార్‌గా మలిచి, తెలుగు సినిమాని కొత్త ట్రెండ్‌లోకి తీసుకెళ్లిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ప్రస్తుతం ఈ సందీప్‌రెడ్డి వంగా 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, 'డియర్ కామ్రేడ్', 'నోటా', టాక్సీవాలా' తదితర చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు.