సినిమా ముద్దు కామన్‌ గురూ!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమా విడుదలయ్యాక టాలీవుడ్‌లో ముద్దు సీన్లపై డిస్కర్షన్‌ ఎక్కువయ్యింది. నిజానికి టాలీవుడ్‌కి ముద్దు సీన్లు కొత్తేమీ కాదు. కానీ 'అర్జున్‌రెడ్డి' సినిమాతో ఎలివేట్‌ ఆయ్యాయి అంతే. గతంలో చాలా మంది హీరోలు ముద్దు సీన్లలో నటించేశారు. 'ఆర్య -2' సినిమాలో అల్లు అర్జున్‌కీ, కాజల్‌కీ మధ్య లిప్‌లాక్‌ ఉన్న సంగతి తెలిసిందే. క్లోజ్‌ షాట్‌లో ఈ సీన్‌ని అంతా ఎంజాయ్‌ చేసేశారు అప్పుడు. కానీ 'అర్జున్‌రెడ్డి' విషయంలో అది బూతు సీను అయిపోయింది. అయితే అందువల్ల సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదులెండి. కానీ డిస్కర్షన్సే ఎక్కువయ్యాయి. అందుకు కారణం సినిమాలో ఈ సీన్‌ ఉందంటూ పోస్టర్స్‌లో పబ్లిసిటీ చేయడమే. సీనియర్‌ హీరోలు కూడా అప్పట్లో లిప్‌లాక్స్‌లో నటించేశారు. అయితే ఈ ముద్దు సీన్లలో కొన్ని మ్యాజిక్స్‌ జరిగేవి అప్పట్లో. అన్నీ ఒరిజినల్‌ అని చెప్పడానికి లేదు. కొన్ని కెమెరా మ్యాజిక్కులు, జిమ్మిక్కులతో జరిగేవి. అయితే ఇప్పుడు రోజులు మారాయి. చూసే ప్రేక్షకుడి ఆలోచన మారింది. ఆ యాంగిల్‌లోనే ప్రస్తుతం సినిమాలు తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే ముద్దు సీన్లు లేకుండా సినిమాలే ఉండవు. చాలా కామన్‌ అక్కడ. టాలీవుడ్‌లోనూ యంగ్‌ హీరోలు ఇప్పటికే ముద్దు సీన్లకి అలవాటు పడిపోయారు. ముద్దుగుమ్మలు కూడా ముద్దు సీన్లలో నటించేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. గతంలో అలా కాదు హీరోయిన్స్‌ నుండి అబ్జక్షన్స్‌ ఉండడంతో మ్యాజిక్స్‌ చేయాల్సి వచ్చేది. ఏది ఏమైనా 'అర్జున్‌రెడ్డి' సినిమాలో లిప్‌లాక్‌ చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఏదైతేనేమి ఎట్టలకేలకు సినిమా మంచి సినిమా అని తేలిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS