ఇప్పుడ యూత్ లో ఒకేఒక సినిమా గురించి చర్చ నడుస్తున్నది. ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీరు ఊహించేసి ఉంటారు. అదే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి.
ఈ చిత్రం వినాయక చవితి స్పెషల్ గా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే పెద్ద స్టార్ హీరోల తరహాలో ఈ చిత్రానికి ముందు రోజు రాత్రే రెండు స్పెషల్ షోలు వేయనుండడం గమనార్హం.
ఇక ఈ చిత్రం యొక్క నిడివి మూడు గంటల పైనే అంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ చిత్ర నిడివి 2 గంటల 55 నిమిషాల పాటు ఉండబోతుంది అని యూనిట్ వర్గాల సమాచారం.
మొత్తానికి ఈ చిత్రం విడుదలకి ముందే ఒక సూపర్ హిట్ చిత్రంగా నిలిచిపోయే లక్షణాలు కనపడుతున్నాయి.