'కబీర్‌ సింగ్‌'గా మారిన 'అర్జున్‌రెడ్డి'.!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోని చేసిన 'అర్జున్‌రెడ్డి' సినిమా సృష్టించిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. ఇంత సెన్సేషనల్‌ విజయం సాధించింది కాబట్టే ఈ సినిమాని తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. కాగా హిందీ వెర్షన్‌కి ఒరిజినల్‌ని తెరకెక్కించిన సందీప్‌రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. 

షాహిద్‌కపూర్‌ ఈ సినిమాలో 'అర్జున్‌రెడ్డి'గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'కబీర్‌సింగ్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించింది తెలుగు 'అర్జున్‌రెడ్డి'. తెలుగు సినిమా ఈక్వేషన్స్‌ మారిపోయాయి ఈ సినిమాతో. బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకే పరిమితమైన లిప్‌లాక్స్‌ ఈ సినిమాతో తెలుగు సినిమాలో విచ్చలవిడిగా విజృంభించేశాయి. ముద్దు సీను లేకుండా తెలుగులో చిన్న సినిమా లేదంటే అది ఫట్టే, లిప్‌లాక్‌ ఉందా. అది ఫసక్‌ హిట్టే అన్న రేంజ్‌లో లిప్‌లాక్స్‌ మన తెలుగు సినిమాపై ప్రభంజనం సృష్టిస్తున్నాయి. అర్జున్‌రెడ్డి తర్వాత వచ్చిన చాలా చిన్న సినిమాలు ఇదే ఫార్ములాతో క్రేజీ హిట్స్‌ సొంతం చేసుకున్నాయి. 

ఇకపోతే హిందీ 'అర్జున్‌రెడ్డి' విషయానికి వస్తే, తెలుగులోనే అంత చూపించిన డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా ఇక హిందీలో ఇంకెంత చేస్తాడో అనే ఆశక్తి నెలకొంది. షాహిద్‌కపూర్‌కి జోడీగా ముద్దుగుమ్మ కైరా అద్వానీ నటిస్తోంది. 'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగులో పిచ్చ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్‌లో 'లస్ట్‌ స్టోరీస్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించి అడల్ట్‌ ఇమేజ్‌ని కూడా సంపాదించేసింది. 

ఇక హిందీ 'అర్జున్‌రెడ్డి'తో బాలీవుడ్‌లో మరింత క్రేజ్‌ దక్కించుకోవడం ఖాయమంటున్నారు. ఇటీవలే షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS