'పెళ్లి చూపులు' చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం లోని పోస్టర్ అసభ్యకరంగా ఉండడంతో బస్సు ఆపి మరీ చించేసాడు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్. హనుమంత రావు.
వివరాల్లోకి వెళితే నిన్న గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి వి.హెచ్ హాజరయ్యారు. సమావేశం ముగించుకుని తిరిగివెళుతుండగా అక్కడ ఆర్టీసీ బస్ మీద అసభ్యంగా కనిపించిన పోస్టర్ ఒకటి ఆయనికి కనిపించింది. దాంతో వెంటనే ఆయన కండక్టర్ సాయంతో బస్సు మీద ఉన్న పోస్టర్ ని తొలగించాడు. ఇలాంటి పోస్టర్లు యువతని తప్పుదోవ పట్టిస్తాయని, డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేయకూడదని ఈ సందర్భంగా వి.హెచ్ పేర్కొన్నారు.
ఈ విషయం పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ 'తాతా చిల్' అంటూ సోషల్ మీడియాలో సెటైర్ వేసాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.