కన్నడ కుట్టి రష్మికకు తొలి సినిమాతోనే బోలెడంత క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్‌ని కంటిన్యూ చేసేలా ఆఫర్ల మీద ఆఫర్లు, వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్‌బాబుతో 'సరిలేరు నీకెవ్వరు..' సినిమాలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఓ బాలీవుడ్ ఆఫర్ రష్మిక తలుపు తట్టినట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి. అది మరేదో కాదు, నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' హిందీ రీమేక్. ఈ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ పాత్ర కోసం రష్మిక పేరు పరిశీలిస్తున్నారు.
మొదటి నుండీ రష్మిక పేరు ఈ సినిమా కోసం బలంగా వినిపిస్తోంది. కానీ, మధ్యలో ఈ ఆఫర్ మరో బాలీవుడ్ భామ చేతికి చిక్కిందనే వార్తలు వినిపించాయి. కానీ, ఆ ఆఫర్ రష్మిక కోసమే ఎదురు చూస్తున్నట్లు తాజా సమాచారం. అయితే, రష్మికపై స్టార్టింగ్ నుండీ ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. తనకున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేలా, భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ పుకారు కారణంగా మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు రష్మిక వదులుకుందనే ప్రచారం కూడా ఉంది. ఒకానొక టైంలో అది పుకారు కాదు, అయినా, క్రేజ్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తే తప్పేంటి.? అని చెప్పుకొచ్చింది.
దాంతో ఆమె ఉద్దేశ్యం నిజమే అనిపించింది కూడా. అయితే, ఇప్పుడు మాత్రం రష్మిక మాట మార్చేస్తోంది. బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిన మాట నిజమే కానీ, రెమ్యునరేషన్ అక్కడ విషయం కాదు, ఆ పాత్రకి తాను పూర్తి న్యాయం చేయలేననీ, అందుకే వదులుకున్నాననీ చెబుతోంది. సో నమ్మి తీరాల్సిందే. అంతేకాదు, రష్మిక ముక్కు సూటిదనం మెచ్చుకుని తీరాల్సిందే కూడా.