నిఖిల్‌ బాగా హర్ట్‌ అయ్యాడట?

By iQlikMovies - May 13, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

సైలెన్స్‌ ఎంత భయంకరంగా ఉంటుందో.. అని ఓ సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్‌ చెబుతారు. అయితే ఆ డైలాగ్‌ వెనక ఆ సినిమాలో సిట్యువేషన్‌ వేరేలెండి. ఇక్కడ సైలెన్స్‌ మ్యాటర్‌ ఏంటంటే, మే డే రోజు విడుదల కావాల్సిన 'అర్జున్‌సురవరం' ఆగిపోయి, ఈ వారం అంటే, మే 17న రిలీజ్‌కి సిద్ధమైంది. అయితే, ఇదే రోజు విడుదల కానున్న 'ఏబీసీడీ' సినిమా ప్రమోషన్స్‌లో అల్లు శిరీష్‌ అండ్‌ టీమ్‌ జోరు చూపిస్తోంది. కానీ నిఖిల్‌ మాత్రం తన అర్జున్‌ సురవరంను ప్రమోట్‌ చేయడంలో సైలెంట్‌గా ఉండిపోయాడెందుకో.

 

ఈ సినిమా స్టార్టింగ్‌ నుండీ, నిఖిల్‌ సోషల్‌ మీడియా వేదికగా ఏవో ఒక అప్‌డేట్స్‌ ఇస్తూ, బహు సందడి చేశాడు. ఎప్పుడయితే ఇంగ్లీష్‌ మూవీ 'అవెంజర్స్‌' కోసం 'అర్జున్‌ సురవరం' అనే ఓ మంచి కంటెంట్‌ ఉన్న స్ట్రెయిట్‌ మూవీని నిర్ధాక్షిణ్యంగా డిస్ట్రిబ్యూటర్లు వాయిదా వేసేశారో.. అప్పుడే నిఖిల్‌ చాలా హర్టయ్యాడట. అయితే, ఏం చేయగలడు. నిఖిల్‌ చేతుల్లో ఏముంది.? ఈ ఒక్కటీ తప్ప. అదే ప్రమోషన్‌. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్నా, 'అర్జున్‌ సురవరం' ప్రమోషన్స్‌ ఎక్కడా కనిపించడం లేదు.

 

ముఖ్యంగా నిఖిల్‌ ఈ సినిమా ప్రమోషన్స్‌ని లైట్‌ తీసుకున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, నిజంగానే అర్జున్‌ సురవరం సందడి ఎక్కడా కనిపించడం లేదు. ప్రమోషన్‌ చేయకపోతే ఈ మధ్య సినిమాలు హిట్‌ అవ్వడం అసాధ్యమైపోతోంది. మరి నిఖిల్‌ ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా కుదురుతుంది.? ఇప్పుడైనా పబ్లిసిటీని దృష్టిలోకి తీసుకుంటాడేమో చూడాలి మరి. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS