మే 9న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహర్షి' మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. నైజాంలో వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. కానీ ఓవర్సీస్‌లో వసూళ్లు భయపెడుతున్నాయి. 2.5 మిలియన్ సాధిస్తేనే అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. రివ్యూల దెబ్బకి ఓవర్సీస్‌లో 'మహర్షి'కి గట్టి షాకే తగిలిందని చెప్పాలి. కానీ, ఎంత ఫ్లాప్ సినిమా అయినా ఓవర్సీస్‌లో మహేష్‌కున్న క్రేజ్‌కి వసూళ్ల విషయంలో ఢోకా ఉండదు. ఈ రోజు, రేపు మ్యాగ్జిమమ్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నైజాంలో కూడా ఈ రోజు, రేపు వసూళ్ల పరంగా 'మహర్షి' పుంజుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రిలీజ్ వసూళ్లపై బాగా ఎఫెక్ట్ చూపించింది. చూడాలి మరి, టాక్‌తో సంబంధం లేకుండా, ఈ రెండు రోజుల్లో 'మహర్షి' ఓకే అనిపించుకుంటే, నిర్మాతలు గాడిన పడ్డట్లే. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ మీద తెరకెక్కిన 'మహర్షి' ఇలా ఫ్యాన్స్‌ని నిరాశపరచడం ఆశ్చర్యకరం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అల్లరోడు తన పాత్ర పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. కానీ, సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉండుంటే, అల్లరోడి కెరీర్‌కి అది ప్లస్ అయ్యేది. ఏమో అప్పుడే మించిపోయిందేమీ లేదు. అసలు సిసలు 'మహర్షి' మేనియా ఎలా ఉండబోతోందో ఈ రెండు రోజుల్లో తేలనుంది