లెక్కలు తప్పుతున్న రాజుగారు!

మరిన్ని వార్తలు

'ఎంతైనా ఊహించుకోండి. అంతకు మించి 'మహర్షి' ఉంటుంది.. ' అంటూ దిల్‌రాజు 'మహర్షి' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఓపెన్‌గా ఆడియన్స్‌కి మాటిచ్చేశారు. మాట కాదు, తెగ ఊరించేశారు. కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన టాక్‌తో రాజుగారి లెక్కలు తప్పులయ్యాయి. ఒకప్పుడు రాజుగారు చెప్పారంటే పక్కాగా అది నిజం అనే నమ్మకం ఉండేది. అంతెందుకు రాజుగారు చెప్పేదాకా కాదు, ఏదైనా ప్రాజెక్ట్‌పై రాజుగారి కన్ను పడిందా.. అంతే ఇక ఆ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ అన్నట్లే అనే బలమైన నమ్మకం ఉండేది.

 

ఆ నమ్మకాన్ని దిల్‌రాజు నిలబెట్టుకున్నారు కూడా గతంలో చాలా సందర్భాల్లో. కానీ ఈ మధ్య రాజుగారి లెక్కలు శుద్ధ తప్పులయిపోతున్నాయి. గతేడాది దిల్‌రాజు నుండి వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్‌ వద్ద వ్యతిరేక రిజల్ట్‌నే చూపించాయి. ఎట్టకేలకు ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని, రాజుగారు తన ఉనికిని చాటుకున్నారు. ఇక 'మహర్షి'తో ఆ లెగసీ కంటిన్యూ అవుతుందని అంతా ఊహించారు. కానీ బెడిసికొట్టింది. 'మహర్షి'తో రాజుగారి లెక్కలు తప్పని తేలిపోయింది. మహేష్‌ని నమ్ముకుని భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించేశారు. పెట్టిన బడ్జెట్‌ తిరిగి రాబట్టుకోవడానికి చేయాల్సినదంతా చేశారు. కానీ ప్రస్తుతానికి లాభం లేకపోయింది. ఇక రాజుగారి నిర్మాణంలో రానున్న తర్వాతి ప్రాజెక్టులు కూడా అంచనాలున్న ప్రాజెక్టులే.

 

అందులో సమంత - శర్వానంద్‌ జంటగా తెరకెక్కుతోన్న '96' రీమేక్‌ మూవీ ఒకటి. శర్వానంద్‌ రాజుగారికి బాగా కలిసొచ్చిన హీరో. సమంతకు ప్రస్తుతం తిరుగే లేదు. సో ఈ సినిమాపై రాజుగారి లెక్కలు తప్పకపోవచ్చు. ఆ తర్వాత ఆయనకు మరో లక్కీ హీరో నాని నటిస్తున్న 'వి' చిత్రం. సుధీర్‌ బాబు హీరోగా, నాని విలన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపైనా బాగానే అంచనాలున్నాయి. వీటన్నింటితో పాటు, అల్లు అర్జున్‌ 'ఐకాన్‌ - కనబడుటలేదు' కూడా రాజుగారి సొంత బ్యానర్‌లో రూపొందబోయే సినిమానే. చూడాలి మరి వీటిలో ఏ సినిమా రాజుగారిని ట్రాక్‌ ఎక్కిస్తుందో


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS