ఐటెం గాళ్ అంటే మన హాట్ బ్యూటీ అనసూయ ఎంత గుస్సా అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి, అదేనండీ స్పెషల్ సాంగ్స్‌కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. వీటి కోసం క్రేజీయెస్ట్ భామల్ని ఏరి కోరి ఎంచుకుంటుంటారు మన దర్శక నిర్మాతలు. అయితే గతంలో ఇలా స్పెషల్ సాంగ్స్‌లో నటించేవారిని ఐటెం గాళ్స్ అని సంబోధించేవారు. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్ దృష్ట్యా స్పెషల్ సాంగ్స్‌లో నర్తించే భామల్లో కొందరిని మాత్రం ఐటెం గాళ్స్ అని సంబోధిస్తుంటే అస్సలు నచ్చడం లేదు.
ఆ లిస్టులో ఇంతవరకూ మన అనసూయనే ఉండేది. ఈ లిస్టులో తాజాగా బాలీవుడ్ ఐటెం బాంబ్ మలైకా కూడా చేరిందండోయ్. అమ్మో 'ఐటెం బాంబ్' అనకూడదు. ఆమె విన్నదంటే, పళ్లు రాలగొడుతుందేమో. ఐటెం అనొద్దని మాత్రం చెప్పింది కానీ, మరి మలైకాని ఏమని సంబోధించాలో చెప్పలేదు. హీరోయిన్ అనాలి అంతేనేమో. ఈమె ఎక్కువగా నటించింది స్పెషల్ సాంగ్స్‌లోనే. అవి కూడా మస్త్ మసాలా సాంగ్సే. హిందీలో 'దిల్ సే' సినిమాలోని 'ఛయ్యా ఛయ్యా' సాంగ్‌తో పాపులర్ అయిన మలైకా అరోరా, తెలుగులో పవర్‌స్టార్ సరసన 'గబ్బర్‌సింగ్'లో 'కెవ్వుకేకా..' సాంగ్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తూ కంటిన్యూస్‌గా వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇప్పుడీ 'ఐటెం' టాక్‌తో మరోసారి మలైకా హాట్ హాట్‌గా చర్చల్లో నిలిచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే, మనం మాట్లాడుకుంటున్న ఈ ఇద్దరూ ఫార్టీ ప్లస్ క్రేజీయెస్ట్ భామలే. ఉన్నమాటంటే ఇంత ఉలుకెందుకో ఈ 'ఫార్టీ ప్లస్' ముద్దుగుమ్మలకి.