'అర్జున్‌ సురవరం' కాన్ఫిడెన్స్‌ భళా!

మరిన్ని వార్తలు

కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌తో పని లేదంటారు. అలాగే సినిమాలో విషయం ఉంటే, ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. కలెక్షన్లు రాబట్టామా.? లేదా.? అంతే. అలా కంటెంట్‌పై కఠినమైన నమ్మకంతో బరిలోకి దిగాడు మన యంగ్‌ హీరో నిఖిల్‌. ఈ సినిమాకి టైటిల్‌ నుండీ, రిలీజ్‌ వరకూ దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఎలాగోలా ఈ నెల 29న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు నిఖిల్‌. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ కూడా షురూ చేశాడు. సోషల్‌ మీడియాలో సినిమాని బాగా ప్రమోట్‌ చేస్తున్నాడు. సోషల్‌ మీడియాలో నిఖిల్‌ చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అఫీషియల్‌గా చిత్ర యూనిట్‌ నుండి విడుదల చేయాల్సిన అన్ని ప్రోమోలు ఎప్పుడో విడుదలైపోయాయి. వాటికి రెస్పాన్స్‌ కూడా అదిరిపోయింది.

 

సో ఇప్పుడు చేయాల్సిందేమీ లేదు. అందుకే నెట్టింటి వేదికగా తను చేయాల్సింది తాను చేస్తున్నాడు నిఖిల్‌. సినిమా కంటెంట్‌ గురించి చెబుతూ, హిట్‌ సినిమాగా ప్రమోట్‌ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో 'అర్జున్‌ లెనిన్‌ సురవరం' అనే ఓ రిపోర్టర్‌ పాత్రలో నిఖిల్‌ నటిస్తున్నాడు. రిపోర్టరే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. చాలా పవర్‌ ఫుల్‌ పాత్ర అది. గన్‌ కన్నా, పెన్నుకే కదా పవర్‌ ఎక్కువ. అలాంటి ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో నిఖిల్‌ నటిస్తున్నాడు ఈ సినిమాలో. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని టి. సంతోష్‌ తెరకెక్కిస్తున్నారు. చూడాలి మరి, నిఖిల్‌ కాన్ఫిడెన్స్‌ ఫలిస్తుందో.? లేదో.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS