అర్జున్ - విశ్వక్‌సేన్ సినిమా ఆగిపోయింది. కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లడం కుదరని పని. విశ్వక్‌తో సినిమా చేసేది లేదని అర్జున్ తెగేసి చెప్పేశాడు. 'అన్ ప్రొఫెషనల్ యాక్టర్' అంటూ... విశ్వక్‌పై విరుచుకుపడ్డాడు. 'చెప్పిందల్లా చేస్తూ... కళ్లు మూసుకుని కాపురం చేయలేను' అని విశ్వక్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు.
విశ్వక్ చెప్పిన మార్పులూ.. చేర్పులూ అర్జున్ స్వీకరించలేదన్నది బయట వినిపిస్తున్న టాక్. అటు అర్జున్, ఇటు విశ్వక్ మీడియా ముందు ఇదే చెప్పారు. కానీ అసలు కారణం మరోటి ఉందట. ఈ కథలో.. అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు, నిర్మాత కూడా అర్జునే. ఈ కథ రాసింది కూడా ఆయనే. కాబట్టి.. కూతురిపై ప్రేమతో తన క్యారెక్టర్‌ని బాగా డవలెప్ చేశాడట అర్జున్.
ఓ రకంగా చెప్పాలంటే ఈ కథలో హీరోయిన్ దే డామినేషన్. విశ్వక్ సేన్... ఆమెను సపోర్ట్ చేసే క్యారెక్టర్ అంతే. కథ చెప్పినప్పుడు మాత్రం విశ్వక్‌ని ఎలివేట్ చేసి చెప్పిన అర్జున్... స్క్రిప్టు విషయం దగ్గరకు వచ్చేసరికి.. తన కుమార్తెని ఎలివేట్ చేశాడట. అలాగైతే ఇది అర్జున్ కుమార్తె సినిమాగానే విడుదల అవుతుంది తప్ప.... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రాదని విశ్వక్ భావించినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈమాట ఎలా చెప్పాలో తెలీక... విశ్వక్ వేరే కారణాలు వెదికేవాడని, అది అర్జున్‌కి నచ్చలేదని... అలా కమ్యునికేషన్ గ్యాప్ పెరిగిందని సమాచారం. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు ఎలా రావాలో విశ్వక్‌కి అర్థం కాలేదని, అందుకే `ఇంకొంచెం టైమ్ కావాలి` అంటూ వ్యవహారాన్ని సాగదీసేవాడని, చివరికి తెగే వరకూ వచ్చేసిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.