అర్మాన్ మాలిక్.. సింగర్‌గా ఈ పేరు సుపరిచితమే. అయితే, ఇటీవల రిలీజైన అల్లు అర్జున్ సినిమా ‘అల వైకుంఠపురములో’ ‘బుట్టబొమ్మ..’ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే కదా.. ఈ పాటను ఆలపించింది మన ఆర్మాన్ మాలికే. ఈయనకు ఈ పాట చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇకపోతే, ఈయనకు బేసిగ్గా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. ఆయనకు సాటి ఎవరూ లేరంటూ ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నాడు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్‌ని ఇష్టపడని వారు ఎవరుంటారు. అందుకే ఆయన్ని అంతా స్టైలిష్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన స్టైల్‌కి ఇక్కడే కాదు, బాలీవుడ్, మాలీవుడ్‌లోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఆర్మాన్ మాలిక్‌కి మాత్రం అల్లు అర్జున్ వెరీ వెరీ స్పెషల్ అట. అయనలా మరొకరు ఉండరు.. అంటూ బన్నీపై తనకున్న అపారమైన అభిమానాన్ని బయట పెట్టాడు ఆర్మాన్ మాలిక్. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో బోలెడన్ని హిట్ సాంగ్స్ పాడిన ఆర్మాన్ గాత్రం ఇటీవల ‘బుట్టబొమ్మ..’ సాంగ్‌తో పాటు, ‘అశ్వద్ధామ’, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని ‘ఇదేరా స్నేహం’ పాటల్లో వీనుల విందుగా వినపడిరది.