మంచు హీరోతో బాల‌య్య‌.

మరిన్ని వార్తలు

బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ సినిమా చేయడానికి అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. మలయాళంలో విజ‌య‌వంత‌మైన `అయ్యప్పనుమ్ కోశియమ్ అనే చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. మలయాళంలో బిజీ మీనన్, పుధ్వీరాజ్ కథానాయకులుగా నటించారు. బీజూ మీనన్ పాత్రలో బాలయ్య నటిస్తారు. పుధ్వీరాజ్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఆ పాత్ర కోసం ఓ యువ హీరోని అన్వేషిస్తున్నారని, నాని, శర్వానంద్ లాంటి యువ హీరో ని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

 

అయితే ఇప్పుడు ఆ పాత్ర మంచు విష్ణుకి దక్కిందని సమాచారం. మోహన్ బాబు కుటుంబంతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. లక్షీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై బాలయ్య ఇది వరకు ఓ సినిమా కూడా చేశాడు. బాలయ్య సూచన మేరకే ఈ చిత్రంలో విష్ణుని ఎంచుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. చివరి వరకూ వచ్చేసరికి ఎన్ని మార్పులు చేర్పులూ జరుగుతాయో ఇప్పుడే ఊహించి చెప్పడం కష్టం. కాకపోతే.. విష్ణుని ఓ ఆప్షన్ గా భావిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS