'ఆర్టికల్ 370' ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఇంతకీ ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటి? జమ్మూ & కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండే చట్టం ఉండాలన్నదే ఈ 'ఆర్టికల్ 370'. ఇందువల్ల కాశ్మీర్ లో వెనుకబాటు తనం పెరుగుతూ వచ్చింది.. ఈ ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ లో, ఇండియానే కాకుండా విదేశీ కంపెనీలు, విద్యా వ్యవస్థలు కూడా ఇక్కడ స్థాపించేందుకు అర్హత ఉండేది కాదు. కాశ్మీర్ లో ని యువతకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక సమస్యలు ఉండేవి.
ఇప్పుడు ఆ 'ఆర్టికల్ 370' ని రద్దు చేయడం తో దేశమంతా మోడీ సర్కారును ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఒక ఇష్యూ వెలుగులోకి వచ్చినప్పుడు సినిమా వాళ్ళు దాని పై సినిమాలు తీసేందుకు కథలు సిద్ధం చేస్తుంటారు.. కానీ ఈ 'ఆర్టికల్ 370' పై ఇప్పటికే ఒక సినిమా రాబోతుంది, అది కూడా మన తెలుగు సినిమా అవ్వడం విశేషం. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా ? మన 'ఆది సాయికుమార్' నటించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. అవును గతం లో 'కేరింత', 'విలేజ్ లో వినాయకుడు' వంటి చిత్రాలు తెరకెక్కించిన 'సాయి కిరణ్' అడవి ఈ చిత్రానికి దర్శకుడు. సాషా ఛెత్రి ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. కృష్ణుడు, పార్వతీశం, అబ్బూరి రవి, కార్తీక్ రాజు మరియు మనోజ్ నందన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.
చిత్ర దర్శకుడు 'సాయి కిరణ్' తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, కాశ్మీరీ బ్రాహ్మణ హక్కుల పోరాటం మరియు కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఇతర సమస్యలను ఈ చిత్రం లో చూపించామని, ఈ 'ఆర్టికల్ 370' ని ప్రభుత్వం రద్దు చేయడం ఆనందకరమని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందు తీసుకురానున్నట్టు చెప్పాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడో విడుదలైంది కానీ చిత్రం ఇంకా విడుదల కాలేదు...ఇప్పుడు ఈ ఇష్యూ హైలైట్ కావడం వల్ల దీన్ని చిత్ర నిర్మాతలు క్యాష్ చేసుకుంటారో లేదో చూడాలి.