'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు': వర్మ సంచలనం!

By iQlikMovies - August 08, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

వర్మ గారి ట్వీట్‌కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఓ ట్వీట్‌ వేస్తే చాలు అదో సంచలనం. కాబట్టి, ఆ ట్వీట్‌కి అంత క్రేజ్‌. ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గవర్నమెంట్‌ పడిపోయి, వైఎస్‌ జగన్‌ గవర్నమెంట్‌ అధికార పీటమెక్కిన తరుణంలో వర్మ ఓ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేశారు. అదే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. సిట్యువేషనల్‌గా అనౌన్స్‌మెంట్‌ అయితే జరిగింది.

 

కానీ, ఆ సినిమాకి సంబంధించి ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. తాజాగా ఆ సినిమా నుండి తొలి పాట ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నామంటూ వర్మ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వర్మ ట్వీట్‌కి పబ్లిసిటీ కూడా కావాలి కదా. అందుకే సడెన్‌గా కాకుండా, రేపు రిలీజ్‌ చేస్తామంటూ అనౌన్స్‌ చేసి, రావల్సినంత పబ్లిసిటీ రాబట్టి మరీ ఈ పాట సంగతి జనానికి చెప్పారు వర్మ. ఇంకేముంది.. సోషల్‌ మీడియాలో రచ్చ రంభోలా జరిగిపోతోంది ఈ పాట విషయమై. ఇంకా పాటలో ఏముందో ఎవరికీ తెలీదు.

 

కానీ, ఈ పాట విషయమై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైపోయింది. కులాల పేరుతో, సోషల్‌ మీడియాలో ట్వీట్ల వర్షం కురుస్తోంది. వర్మకి కావల్సిందిదే కదా. ఈ పాటలో ఎటువంటి కాంట్రవర్సీకి చోటుండదనీ, చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నా.. అని వర్మ పేర్కొనడం విశేషం. కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వర్మ ఈ పాటలో కాంట్రవర్సీ ఉండదని చెప్పడం నిజంగానే ఆశ్చర్యపరుస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ పాట ట్రైలర్‌ విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS