రెండో అరుంధతిని ఏకి పారేస్తున్నారుగా!

మరిన్ని వార్తలు

'అరుంధతి' సినిమా ఓ క్లాసిక్‌ మూవీ. ఇలాంటి సినిమాలకు సీక్వెల్స్‌ ఆలోచన చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాల్సి వచ్చినా, మొదటి పార్ట్‌లోని ఆర్టిస్టులతోనే సీక్వెల్‌ రూపొందిస్తే, ఆ ఫ్లేవర్‌ని అదే స్థాయిలో ఫీలవుతారు ఆడియన్స్‌. కానీ, అలా కాకుండా ఫ్లేవర్‌ దెబ్బ తీసే ఆలోచన చేస్తే మాత్రం ఇదిగో ఇలాగే విమర్శల పాలవ్వాల్సి వస్తుంది మరి. ఇదంతా ఎందుకు చెప్పుకోవల్సి వస్తుందో ఈ పాటికి మీరే అర్ధమైపోయుంటుంది. 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో సెగల గుబులు పుట్టించేసిన అమ్మడు పాయల్‌ రాజ్‌పుత్‌తో 'అరుంధతి 2' ప్లాన్‌ చేస్తున్నామంటూ శంఖు చక్ర ఫిలిమ్స్‌ బ్యానర్‌ నుండి ప్రకటన వెలువడింది.

 

కోటి తూముల ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవల్లో, భారీ బడ్జెట్‌ విజువల్‌ గ్రాఫిక్స్‌తో రూపొందించబోతున్నామని ప్రకటించారు. అంతా బాగానే ఉంది. కానీ, 'అరుంధతి'లో జేజమ్మ అంటే అనుష్క. అనుష్క అంటే జేజమ్మ. అది అంతే. ఆ పాత్రలో ఎంత టాలెంటెడ్‌ అయినా, మరొకర్ని ఊహించలేం. అలాంటిది సెగలు పుట్టించే క్యారెక్టర్‌తో తెలుగు తెరకు పరిచయమై అంతగా అనుభవం లేని నటితో ఇలాంటి క్లాసిక్స్‌ని టచ్‌ చేసి, వాటి ఫ్లేవర్‌ చెడగొట్టే ప్రయత్నం చేయొద్దంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్లాసిక్స్‌ని టచ్‌ చేయాలంటే క్రేజ్‌ మాత్రమే ఉంటే సరిపోదు. ఆ లెవల్‌ వేరే.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, టాలెంట్‌ పరంగా పాయల్‌ రాజ్‌పుత్‌ని తప్పు పట్టడానికి లేదు.

 

కానీ, టైటిల్‌ విషయంలోనైనా నిర్మాతలు కాస్త వెనక ఆలోచన చేయాల్సి ఉంది. 'అరుంధతి' అనే టైటిల్‌ని టచ్‌ చేయకుండా, విజువల్‌ వండర్‌ మూవీగా వేరే టైటిల్‌ ఏదైనా పెట్టి ప్రయత్నించుకోవచ్చు. అప్పుడు ఇంతలా విమర్శలు ఎదుర్కొనే అవసరం ఉండదు కదా. ఇదిలా ఉంటే, చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నట్లుగా, మన రెండో అరుంధతి పాయల్‌ రాజ్‌పుత్‌ తన పని తాను చేసుకుపోతోంది. ఈ సినిమా కోసం అప్పుడే గుర్రపు స్వారీలు, కత్తిసాముల్లో స్పెషల్‌ ట్రైనింగ్‌ అయిపోతోందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS