'కామ్రేడ్‌'కి స్పెషల్‌ అట్రాక్షన్‌!

మరిన్ని వార్తలు

'డియర్‌ కామ్రేడ్‌' సినిమా వచ్చే నెల్లో గ్రాండ్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. జూలై 26న వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. విజయ్‌ దేవరకొండ మేనియా తెలుగులోనే కాకుండా, 'నోటా' సినిమాతో తమిళనాడుకీ పాకిన సంగతి తెలిసిందే. ఇక కన్నడ బ్యూటీ రష్మికా మండన్నాకి కన్నడలో పిచ్చ క్రేజ్‌ ఉంది.

 

సో అలా ఈ సినిమా నాలుగు భాషల్లో ఎట్‌ ఏ టైమ్‌ విడుదలవుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాల్ని క్రియేట్‌ చేసింది. దాంతో పాటు, లిరికల్‌ వీడియోల ద్వారా వచ్చిన స్టిల్స్‌లో పిచ్చెక్కించేస్తున్నాయి. ఆల్రెడీ విజయ్‌ దేవరకొండ, రష్మికా జంట టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జంటగా పేరు తెచ్చేసుకుంది 'గీత గోవిందం' సినిమాతో. జత కట్టింది ఒక్క సినిమానే అయినా, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టేయడంతో ఈ జంటకు అంతటి క్రేజ్‌ దక్కింది. జోడీ పరంగానూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే, తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ సినిమాపై హైప్‌ ఇదే రకంగా ఉంది.

 

మలయాళం విషయానికి వస్తే, ఈ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ తోడైంది. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమాకి ఓ హ్యాండేశాడు. ఏంటంటే, ఈ సినిమా కోసం ఓ పాటేసుకున్నాడట దుల్కర్‌. అయితే, దుల్కర్‌ సాంగ్‌ కేవలం మలయాళ వెర్షన్‌కే ఉంటుందట. ఆ పాటేంటీ.? అనే వివరాలు తెలియవు కానీ, 'డియర్‌ కామ్రేడ్‌' మలయాళ వెర్షన్‌కి దుల్కర్‌ స్పెషల్‌ సాంగ్‌ ఖచ్చితంగా స్పెషల్‌ బెనిఫిట్‌ అవుతుందంటున్నారు. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS