సమంత తన జీవితంలోకి అడుగు పెట్టాక, చైతూకి దశ తిరిగిందనే చెప్పాలి. లైఫ్ పాట్నర్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా 'మజిలీ' సూపర్ హిట్ అయ్యింది చైతూ కెరీర్‌లో. తర్వాత నుండి వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నాడు చైతూ. అందులో రెండు మల్టీ స్టారర్లే. అవి కూడా ఫ్యామిలీ స్టార్స్‌తోనే. నాగార్జున - నాగచైతన్య కాంబో ప్యాక్‌గా తెరకెక్కుతోన్న 'బంగార్రాజు' సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్ననాయనా' సినిమాకి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాకి నాగచైతన్య మొదట్లో గెస్ట్ రోల్ అన్నారు. కానీ, తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ అయిపోయింది.
అలా మల్టీ స్టారర్ మూవీ అయ్యిందిది. ఈ సినిమాలో చైతూ సరసన కీర్తిసురేష్ నటిస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు చైతూ మామ వెంకీతో కలిసి 'వెంకీ మామ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీతో పాయల్ రాజ్‌పుత్ జత కడుతోంది. ప్రస్తుతం 'వెంకీ మామ' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళ్లనుంది.
మరోవైపు చైతూ శేఖర్ మ్ముల దర్శకత్వంలో ఓ సినిమాని లేటెస్ట్‌గా ఓకే చేశాడు. ఆగస్ట్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, నాగచైతన్య సూపర్ బిజీ అయిపోయాడనిపిస్తోంది. ఇప్పట్లో చైతూ డైరీ ఖాళీ అయ్యేలానే లేదు. ఇవన్నీ ఒకెత్తు అయితే, సమంత కాంబోలో మరో డిఫరెంట్ లవ్ స్టోరీ చైతూ దగ్గరికి వచ్చినట్లు తాజా సమాచారమ్.