సాహో హంగామా అయిపోయింది. ఇప్పుడు సైరా సందడి మొదలు కాబోతోంది. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మరోవైపు ప్రచార కార్యక్రమాలకూ శ్రీకారం చుడుతున్నారు. ఈలోగా సైరాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. సైరాకు... తమిళ హీరో అరవింద్ స్వామి సాయం అందిస్తున్నాడట. అదీ తమిళ వెర్షన్ కోసం. సైరాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
సైరా తమిళ వెర్షన్ కోసం చిరు పాత్రకు అరవింద్ స్వామి డబ్బింగ్ చెబుతున్నాడు. ఇప్పటికే అరవింద్ స్వామి డబ్బింగ్ ప్రక్రియ ప్రారంభించేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కమల్ గళం నుంచే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. తెలుగు వెర్షన్లో పవన్ కల్యాణ్ గొంతుకు వినిపించిన సంగతి తెలిసిందే. మలయాళ, హిందీ భాషల్లో చిరు పాత్రకు ఎవరు డబ్బింగ్ చెబుతారో చూడాలి.