సాహో ఫస్ట్ షో అవ్వడానే దానిపై కాపీ ముద్ర పడిపోయింది. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్‌కి ఇది కాపీ అని, ఆ కథని అజ్ఞాతవాసిగా తీశారని, దాన్ని చూసుకోకుండా సాహో ఎలా తీశారని విమర్శకులు వేలెత్తి చూపించారు. ఈ విషయంపై సుజిత్ తొలిసారి స్పందించాడు. తాను అసలు లార్గోవించ్ సినిమా చూడలేదని, తన రన్ రాజా రన్‌నే కాస్త మార్చి సోహోగా తెరకెక్కించానని క్లారిటీ ఇచ్చాడు.
అంతే కాదు.. అసలు ఈ సినిమా లార్గోవించ్‌కి కాపీ అన్నవాళ్లెవ్వరూ ఆ ఫ్రెంచ్ సినిమా చూసుండరని సెటైర్లు వేశాడు. తండ్రి చనిపోతే, ఆ స్థానంలో వచ్చిన కొడుకు తన వారసత్వాన్ని నిరూపించుకోవడం లార్గోవించ్ కథ అని, సాహోలో మాత్రం కథ వేరుగా ఉంటుందని, తండ్రిని చంపినవాళ్లపై కొడుకు పగ తీర్చుకుంటాడని, తండ్రి చనిపోయినంత మాత్రాన అలాంటి కథలన్నీ లార్గోవించ్ సినిమా నుంచి కాపీ కొట్టినట్టే అనుకుంటే ఎలా? అని ప్రశ్నించాడు.
తన సినిమా మొత్తం స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగిందని, కొంతమంది రివ్యూ రైటర్లకు సినిమా అర్థం కాలేదని, దాంతో ఈ సినిమాలో అర్థమే లేదని రాశారని, అర్థం కాకపోతే మరోసారి సినిమా చూసి రివ్యూ ఇవ్వాల్సిందని హితవు పలికాడు సుజిత్. మరి దీనిపై విమర్శకులు ఎలా స్పందిస్తారో చూడాలి.