ధృవలో రామ్ చరణ్‌కి ధీటుగా నటించాడు అరవింద్ స్వామి. తన విలనిజమే.. `ధృవ`కి ప్లస్ పాయింట్. ఆ తరవాత.. తెలుగులో అరవింద్ స్వామికి చాలా అవకాశాలొచ్చాయి. కానీ దేనికీ ఒప్పుకోలేదు. ఇప్పుడు మరోసారి మెగా సినిమాలో విలన్ గా ఫిక్సయ్యాడని సమాచారం. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో `ఆచార్య` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ కథానాయిక. ఈ చిత్రంలో విలన్ గా అరవింద్ స్వామిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
విలన్ గా చాలామంది పేర్లు అనుకున్నా, అరవింద్ స్వామి అయితే బాగుంటుందని, ఆ పాత్ర మరింత స్టైలీష్‌గా తీర్చిదిద్దవచ్చని కొరటాల భావించాడట. అరవింద్ స్వామి ఉంటే.. తమిళ మార్కెట్ కీ ఉపయోగపడుతుంది. అందుకే.. పారితోషికం ఎంత డిమాండ్ చేసినా సరే, తననే తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. జనవరి నుంచి అరవింద్ స్వామి సెట్‌కి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.