బిగ్‌బాస్ ఎంత పక్కా స్క్రిప్ట్‌తో నడుస్తోందో ఇంకోసారి నిరూపితమయ్యింది. అబిజీత్, అఖిల్, అరియానా, అవినాష్ నామినేట్ అయ్యారు ఎలిమినేషన్‌కి తొలుత. కానీ, అనూహ్యంగా అబిజీత్ ప్లేస్‌లోకి మోనాల్ వచ్చింది. అంటే, దానర్థమేంటి.? మోనాల్ గజ్జర్‌కి ఎలివేషన్ ఇవ్వబోతున్నారన్నమాట. అబిజీత్ అభిమానులు మోనాల్‌ని సేవ్ చేస్తారు కాబట్టి, ఆమె మరిన్ని వారాలు బిగ్ హౌస్‌లో వుండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మరోపక్క, అఖిల్ సార్థక్ మీద సింపతీ క్రియేట్ చేయాలి.
ఈ మొత్తం వ్యవహారంలో అరియానా - అవినాష్‌లలో ఎవరో ఒకరు బలిపశువు అవడం ఖాయం. అవినాష్ ఎలాగూ బిగ్‌బాస్‌కి ఈజీ టార్గెట్. సో, ఈ వారం అవినాష్ ఔట్ అయిపోవడానికి ఛాన్సులు ఎక్కువ వున్నాయి. ఈక్వేషన్ ఇలా నడుస్తోంది. అంటే, ఆడియన్స్ మైండ్‌సెట్‌ని మార్చేయడం కోసం అడ్డగోలుగా బిగ్‌బాస్ టీమ్ ప్రయత్నిస్తోందని అనుకోవాలా.? చూసే ఆడియన్స్‌కి అయితే అలాగే కనిపిస్తోంది.
గత సీజన్లకు భిన్నంగా ఈసారి బిగ్‌బాస్‌లో రియాల్టీ పూర్తిగా కొరవడింది. ఎవరో ఒకర్ని పంపించెయ్యడం కాదు, ఫలానా వ్యక్తిని టార్గెట్ చేసి పంపెయ్యాలన్నట్లు సాగుతున్నాయి ఎలిమినేషన్ కోసం సాగే నామినేషన్ ఎపిసోడ్స్. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా అలాగే సాగుతోంది. చిత్రంగా ప్రతి విషయం ముందుగానే లీకయిపోతోంది. అంటే, స్క్రిప్ట్ దశలోనే లీకులు షురూ అవుతున్నాయన్నమాట. హరిక పట్ల నెగెటివిటీ వచ్చింది.. అఖిల్ మీద సింపతీ పెరిగింది.. ఇవన్నీ స్క్రిప్ట్ వ్యవహారాలు కాక మరేమిటి.?