చరణ్‌ సినిమాలో ఆ యంగ్‌ హీరో మాటేంటి?

మరిన్ని వార్తలు

'హాయ్‌' సినిమాతో పరిచయమై, 'సొంతం' సినిమాతో హీరోగా సక్సెస్‌ అందుకున్నాడు ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడు ఆర్యన్‌ రాజేష్‌. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ, హీరోగా స్టార్‌డమ్‌ సంపాదించుకోలేకపోయాడు. అందగాడు, ఆజానుబాహుడు అయినా కానీ హీరోగా అంతగా కలిసి రాలేదు ఆర్యన్‌ రాజేష్‌కి. ఆ తర్వాత ఇక సినిమాలకు టాటా బైబై చెప్పేసి, నిర్మాణ రంగం వైపు అడుగులు కదిపాడు. ఈ మధ్యనే ఆర్యన్‌ రాజేష్‌ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ మూవీలో ఆర్యన్‌ రాజేష్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడనీ తెలుస్తోంది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్‌కి అత్యంత సన్నిహితుడైన పాత్రలో ఆర్యన్‌ రాజేష్‌ నటించబోతున్నాడట. చరణ్‌ సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ పోషిస్తున్న యంగ్‌ హీరోస్‌కి ఈ మధ్య మంచి ఆదరణ దక్కుతోంది. 'ధృవ' సినిమాలో చరణ్‌కి ఫ్రెండ్‌గా నటించిన యంగ్‌ హీరో నవదీప్‌కి మంచి గుర్తింపు దక్కింది. 

అలాగే రీసెంట్‌గా 'రంగస్థలం'తో ఆది పినిశెట్టికి అంతే ఆదరణ దక్కింది. ఇప్పుడు ఆర్యన్‌ రాజేష్‌ వంతొచ్చింది. హీరోగా నిలదొక్కుకోలేకపోయిన ఆర్యన్‌ రాజేష్‌, చరణ్‌ సినిమాతో మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడేమో చూడాలిక. మరోవైపు ఆర్యన్‌ రాజేష్‌ సోదరుడు అల్లరి నరేష్‌కీ ఈ మధ్య టైం కలిసి రావడం లేదు. దాంతో సూపర్‌ స్టార్‌ మహేష్‌ సినిమాలో అల్లరోడు అల్లరల్లరి చేయనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఇలా ఈ ఇద్దరు ఇవివి అన్నదమ్ములు స్టార్‌ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్‌ పాత్రల ద్వారా తమ ఉనికిని తిరిగి చాటుకుంటారేమో చూడాలి మరి.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS