విజయ్‌ కోసం ఆ బ్యూటీ రెండోస్సారి.!

By iQlikMovies - July 02, 2018 - 16:28 PM IST

మరిన్ని వార్తలు

'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ రష్మికా మండన్నా. తొలి సినిమాకే హిట్‌ కొట్టిన ఈ బ్యూటీకి అంతకు ముందు నుండే టాలీవుడ్‌లో బోలెడంత పాపులారిటీ ఉంది. కన్నడ 'కిర్రిక్‌ పార్టీ'లో నటించిన ఈ ముద్దుగుమ్మకి ఆ సినిమా విజయం తెలుగులోనూ పాపులర్‌ అయ్యేలా చేసింది. 

తెరంగేట్రమే అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో జరగనుందనే ప్రచారం జోరుగా సాగింది ఆ టైంలో. అయితే అనూహ్యంగా యంగ్‌ హీరో నాగశౌర్య సినిమాతో తెలుగు నాట ఆడుగు పెట్టింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెన్సేషనల్‌ స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండతో ఓ చిత్రంలో నటిస్తోంది. అదే 'గీతా గోవిందం'. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఈ చిత్రంపై ఆశక్తిని పెంచింది. కాగా రష్మికా తదుపరి చిత్రం కూడా విజయ్‌ దేవరకొండతోనే కావడం విశేషం. 

'రంగస్థలం' చిత్రంతో బంపర్‌ హిట్‌ కొట్టి, తిరుగులేని లాభాలు ఆర్జించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండ ఓ చిత్రం చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా ప్రారంభమైంది. హైద్రాబాద్‌లో ఘనంగా లాంఛ్‌ అయిన ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్లు సుకుమార్‌, కొరటాల శివ, చంద్రశేఖర్‌ యేలేటి తదితరులు, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తదితరులు హాజరయ్యారు. 

'డియర్‌ కామ్రేడ్‌' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భరత్‌ కమ్మ తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS