ఆశా భోస్లే కి యష్ చోప్రా మెమోరియల్ అవార్డు

మరిన్ని వార్తలు

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా మెమురియ‌ల్ జాతీయ అవార్డు 2018ని టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేష‌న్  ఫిబ్ర‌వ‌రి 16న ముంబాయిలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో ప్ర‌దానం చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో టి.సుబ్బిరామిరెడ్డి, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు, బాలీవుడ్ న‌టి రేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా రేఖ ఆశా భోస్లేకి త‌మ అభినంద‌న‌లు తెలియ‌చేస్తూ...పాదాభివంన‌దం చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌మ్ చోప్రా, అల్క య‌గ్నిక్, జాకీ షాఫ్ర్, ప‌రిణితి చోప్రా, పూన‌మ్ దిలాన్, జ‌య‌ప్ర‌ద త‌దిత‌ర బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 

ఈ అవార్డ్ ను గ‌తంలో ల‌తా మంగేష్క‌ర్, అమితాబ్ బ‌చ్చ‌న్, రేఖ‌, షారుఖ్ ఖాన్ అందుకున్నారు. 84 సంవ‌త్స‌రాల ఆశా భోస్లే సుదీర్ఘ సినీ సంగీత ప్ర‌స్ధానంలో 7 ద‌శాబ్ధాలుగా 11వేల పాట‌ల‌ పాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 భాష‌ల్లో పాట‌లు పాడి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారామె.

ఈ అవార్డ్ జ్యూరీలో యశ్ చోప్రా స‌తీమ‌ణి ప‌మేలా చోప్రా, బోనీక‌పూర్, మ‌ధుర్ భాండార్క‌ర్, సింగ‌ర్ అల్కా య‌గ్నిక్, న‌టుడు ప‌ద్మిని కోహ్ల‌పూర్, స్ర్కిప్ట్ రైట‌ర్ హ‌నీ ఇరానీ, అను, శ‌శి రంజ‌న్ స‌భ్యులుగా ఉన్నారు. 2012లో చ‌నిపోయిన య‌శ్ చోప్రా జ్ఞాప‌కార్ధంటి.సుబ్బిరామిరెడ్డి అను రంజ‌న్, శ‌శి రంజ‌న్ క‌ల‌సి ఈ అవార్డును నెల‌కొల్పారు. ఈ అవార్డ్ తో పాటు 10 ల‌క్ష‌లు న‌గ‌దును కూడా అంద‌చేసారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS