మహిళా సంఘం నాయకురాలు, సామాజిక వేత్త దేవి ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు రామ్‌గోపాల్ వర్మ విచారణ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఈ విచారణలో ఇటీవల వర్మ తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ) విషయమై పలు అంశాలను సీసీఎస్ పోలీసులు కూపీ లాగారు. వర్మ ఇచ్చిన సమాధానాల్ని పరిగణలోనికి తీసుకుని ఆయన్ని అరెస్టు చేయాలా వద్దా అని ఆలోచిస్తామనీ సీసీఎస్ పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.
గత నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జీఎస్‌టీ' వీడియో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ పలు మహిళా సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న సామాజిక కార్యకర్త దేవితో వర్మ అభ్యంతరకరంగా మాట్లాడిన కారణంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక విచారణ అనంతరం విచారణ అధికారి మాట్లాడుతూ- ఆర్జీవీ ల్యాప్ టాప్ ని సీజ్ చేసినట్టుగా తెలిపారు, దానిని FSLకి పంపి అందులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తాము అని చెప్పారు. ఇక వరమని మళ్ళీ వచ్చే శుక్రవారం తమ ముందు విచారణకి హాజరు కమ్మని చెప్పారు.ఈ విచారణకి సంబంధించి తాను ఈరోజు 7గంటలకు ఒక టీవీ ఛానల్ లో మాట్లాడతాను ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.
పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన 'జీఎస్‌టీ' వీడియో కారణంగా తలెత్తిన వివాదమిది. ఈ వీడియో రిలీజవ్వడం, మంచి రెస్పాన్స్ అందుకోవడం, వర్మ ఆ వీడియోకి సీక్వెల్ తీస్తానని ప్రకటించడం, ఆల్రెడీ వర్మ ఆ పనుల్లో బిజీగా ఉండడం కూడా జరిగిపోతోంది. అయినా వర్మని ఈ జీఎస్‌టీ సెగ మాత్రం కుదిపేస్తోంది. నిజానికి వర్మకిలాంటివన్నీ కొత్తేం కాదు. కానీ ఈ సారి కేసులు, పోలీస్ విచారణ, అరెస్టు ఆరోపణల వరకూ వెళ్లిందంటే, ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో చూడాలి మరి.