గళ్లా అశోక్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ మహేష్‌కి మేనల్లుడే ఈ గళ్లా అశోక్. టీడీపీ ఎంపీ గళ్లా జయదేవ్ తనయుడైన గళ్లా అశోక్ తన మేనమామకు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పాడు.
'థాంక్యూ మావయ్యా.. నువ్వే నాకు బిగ్గెస్ట్ ఇన్స్‌ప్రేషన్. క్రమశిక్షణ విషయంలోనూ సినిమా పట్ల అంకిత భావం విషయంలోనూ నిన్నే ఆదర్శంగా తీసుకుంటాను..' అని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. మరోపక్క మహేష్‌బాబు తన మేనల్లుడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ తెలుగు సినీ పరిశ్రమలోకి స్వాగతం పలికాడు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా, సోషల్ మీడియాలో కొందరు అభిమానులు మా సూపర్‌స్టార్‌ని 'మావయ్యా.' అంటావా అని గళ్లా అశోక్‌ని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనలోనూ అర్ధం ఉంది. మహేష్‌బాబుకు ఇంకా ఇరవై ఏళ్లే అని చెబితే నమ్మి తీరాల్సిందే మరి. అయితే ఇలాంటివి సోషల్ మీడియాలో మామూలే. అభిమానుల పేరుతో కొంతమంది లేని పోని వివాదాలకు తావిస్తుంటారు.
ఇదిలా ఉంటే, అశోక్ సరసన నభా నటేష్ నటిస్తోంది. తొలి సినిమా సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో అయిన సుధీర్‌బాబుతో చేసింది. సుధీర్‌బాబు గళ్లా అశోక్‌కి బాబాయ్ అవుతాడు. ఇలా సూపర్‌స్టార్ కుటుంబంలో వరసగా సినిమాలు చేస్తోంది ఈ కన్నడ కస్తూరి.