నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్, రితికా నాయక్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ తదితరులు
దర్శకత్వం : విద్యా సాగర్ చింత
నిర్మాతలు: బాపినీడు బి & సుధీర్ ఈదర
సంగీత దర్శకుడు: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: పవి కె పవన్
ఎడిటర్ : విప్లవ్ నైషాదం
రేటింగ్: 2.75/5
విశ్వక్ సేన్ యూత్ ఆడియన్స్ లోకి ఒక మెరుపులా వచ్చాడు. ఈ నగరానికి ఏమైయింది ? ఫలక్ నూమ దాస్ సినిమాలు విశ్వక్ సేన్ ని మాస్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. మధ్య చేసిన పాగల్ నిరాశ పరిచింది. ఐతే తన ఇమేజ్ కి భిన్నంగా ముఫ్ఫై మూడేళ్ళు దాటిన పెళ్లి కానీ ఒఅ కుర్రాడి పాత్రని ఎంచుకున్నాడు 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా కోసం. పోస్టర్ , ట్రైలర్ లో కొత్తగా కనిపించాడు. మరి ఆ కొత్తదనం సినిమాలో ఉందా ? ఇంతకీ ఏమిటి ? అర్జున్ కుమార్ కథ?
కథ:
సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్ (విశ్వక్ సేన్)కు ముఫ్ఫై మూడు ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాదు. సూర్యపేటలో ఎక్కడ చూసిన ఇదే ముచ్చట. తెలంగాణ ఎక్కడా అమ్మాయి కుదరక చివరికి రాష్ట్రం దాటి ఈస్ట్ గోదావారిలో వుండే అశోకపురంలో మాధవి(రుక్సార్ దిల్లాన్)తో నిశ్చితార్థం పక్కా చేసుకుంటారు. నిశ్చితార్థం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని సమయానికి దేశం లాక్‌డౌన్ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.
లాక్ డౌన్ లో మంచి ముహూర్తం చూసి అక్కడే పెళ్లి చేసుకోవాలని అర్జున్ ఫ్యామిలీ నిర్ణయిస్తుంది. సరిగ్గా ఇదే సమయానికి మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో అర్జున్ కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మాధవి ఎక్కడికి వెళ్ళింది ? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) తో అర్జున్ కి ఎలాంటి అనుబంధం ఏర్పడింది ? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ:
దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. చిన్న పాయింట్ ని పట్టుకొని రెండు గంటలు పాటు కాలక్షేపం ఇస్తున్నారు. అర్జున కళ్యాణం దర్శకుడు విద్యా సాగర్ చింతా కూడా అలాంటి చిన్న పాయింట్ తో మ్యాజిక్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆ పాయింట్ డీల్ చేయడంలో తికమక పడిపోయాడు. ఈ సినిమాలో చాలా పాయింట్లు వున్నాయి.
33ఏళ్ళు వచ్చినా పెళ్లి కానీ ఓ కుర్రాడి కథ చెప్పడానికి ఒక సినిమా చాలు. ఇది సరిగ్గా డీల్ చేస్తే ఒక మంచి కథ అవుతుంది. కానీ ఆ పాయింట్ లాక్ డౌన్ ని జత చేశాడు.. పోనీ అక్కడితో ఆగాడా ? అంటే కులాలు వివాహాలు అని మరో పాయింట్ ఎత్తుకున్నాడు.. పోనీ అక్కడితో ఆగలేదు .. ఇష్టం లేని పెళ్లి అని మరో యాంగిల్.. పోనీ ఇక్కడితోనైనా అయిపోయిందా అనే కాదు.. ఆంద్ర .. తెలంగాణ.. అని మరో ఫీలింగ్.. ఇన్ని ఫీలింగ్స్ మధ్య ఎలాంటి ఫీలింగ్ లేకుండానే ముగిసిపోతుంది అర్జున కల్యాణం.
సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ సాగాదీత వ్యవహారం సాగుతూనే వుంటుంది. ఎక్కడా వేగం కనిపించదు. సినిమా ఫస్ట్ అంతా ఒక యంగేజ్ మెంట్ వీడియో చూసినట్లపిస్తది. లాక్ డౌన్ పాయింట్ ని ఈ కథకు ముడి పెట్టడం నప్పలేదు. ఇంటర్వెల్ లో సెకండ్ హాఫ్ పై ఆసక్తి రేపడానికి ఇచ్చిన ట్విస్ట్ సహజంగా వుండదు. హీరోయిన్ పాత్ర భర్తీ చేయడానికి చెల్లెలు వసుధ పాత్రని ప్రవేశ పెట్టిన దర్శకుడు ఆ పాత్రలతో కూడా ఎమోషన్ రాబట్టుకోలేకపోయాడు. ఇక చివరిగా పెళ్లి గురించి ఒక లెక్చర్ ఇచ్చి సినిమాకి ఎండ్ కార్డ్ వేసేశాడు దర్శకుడు.
నటీనటులు:
విశ్వక్ సేన్ కి ఇది కొత్త పాత్రే. అతని ఇమేజ్ ని పక్కనే పెట్టి చేశాడు. లావుగా ముద్దపప్పులా అమాయకంగా తన పాత్రకు తగ్గట్టు కనిపించాడు. ఈ సినిమా కోసం ఇలా మేకోవర్ అయ్యింటే ఓకే కానీ లేకపోతె అర్జంట్ గా లావు తగ్గి స్మార్ట్ గా కనిపించాలి లేకపోతే కష్టం.
రుక్సార్ దిల్లాన్ పాత్ర మొదటి సగానికి పరిమితమైయింది. ఆమె నటన కూడా అతంత మాత్రమె. రితికా నాయక్ మంచి మార్కులు పడతాయి. నిజానికి ఇందులో హీరోయిన్ గా రితికానే అనుకోవాలి. పాత్రకు తగ్గ అందం అభినయం వున్నాయి. కాదంబరి కిరణ్, రాజ్ కుమార్ కసి రెడ్డి పాత్రలు నవ్వులు పంచాయి. మిగతా నటులు పరిధి మేర చేశారు
టెక్నిల్ గా:
జై క్రిష్ సంగీతం బావుంది. నేపథ్య ఆకట్టుకుంది. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎటిటర్ విప్లవ్ నైషధం ఐ=ఇంకా శార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణవ విలులు ఓకే.
ప్లస్ పాయింట్స్:
విశ్వక్ సేన్
కొన్ని కామెడీ సీన్లు
మైనస్ పాయింట్స్:
సాగాదీత
బలహీనమైన కథనం
ఫైనల్ వర్దిక్ట్: కళ తప్పిన కళ్యాణం