పవన్ కల్యాణ్‌కి అభిమానుల కంటే భక్తులే ఎక్కువ. ఈవిషయం చాలాసార్లు రుజువైంది. సెలబ్రెటీల్లో కూడా ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చిన అషూ రెడ్డి కూడా... పవన్‌కి వీర భక్తురాలు. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకున్న అషూ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ స్టార్ డమ్ అనుభవిస్తోంది. ఇటీవల పవన్ ని కలిసే అవకాశం వచ్చింది అషూకి. ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది కూడా.
'నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారు. దాదాపు 2 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో సంతోషంగా అనిపించింది. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్ లెటర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణ్' అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. అయితే అషూకి ఓ నెటిజన్ నుంచి ఆమెకు ఊహించిన ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ పవన్ కల్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని ప్రశ్నించగా తప్పకుండా ఓకే చెబుతానంటూ బదులిచ్చింది. దాంతో పవన్‌కి నాలుగో భార్య దొరికేసిందంటూ.. సోషల్ మీడియాలో అషూని బాగా ట్రోల్ చేస్తున్నారు.