'ఈగ'... టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ సినిమా. ఇలాంటి కాన్సెప్టుతోనూ సినిమా తీయొచ్చా? అని ఆశ్చర్యపరిచింది. ఓ చిన్న జీవి.. అత్యంత శక్తిమంతమైన ప్రతినాయకుడ్ని ఎలా ఎదుర్కొంది? ఎలా ఓడించింది? అన్నదే కాన్సెప్టు.
ఇప్పుడు ఇదే కాన్సెప్టుని కాపీ కొట్టాడు ఓ యువ దర్శకుడు. ఆయనా రాజమౌళి శిష్యుడే. రాజమౌళి దగ్గర కొన్ని సినిమాలకు సహాయకుడిగా పని చేసిన అశ్విన్ గంగరాజు.. ఇప్పుడు దర్శకుడయ్యాడు. తన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశవాణి`. ఈ సినిమా కాన్సెప్టు ఏమిటంటే.... ప్రాణం లేని రేడియో ప్రతీకారం తీర్చుకోవడం. అదీ.. ఓ శక్తిమంతమైన విలన్‌పై. ఈగ కాన్సెప్టుకి దాదాపుగా దగ్గరగా ఉందీ స్టోరీ. అయితే.. ఈ సినిమాకి నిర్మాత రాజమౌళి తనయుడు కార్తికేయ కావడం విశేషం. సముద్రఖని ఓ కీలక పాత్ర పోషించారు. అయితే రాజమౌళి తీసిన `ఈగ` కూడా సొంత కథేం కాదు. `కాక్రోచ్` అనే హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తే. ఇప్పుడు గురువు దగ్గర్నుంచి శిష్యుడు స్ఫూర్తి పొంది ఈ సినిమా తీశాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.