సైరా తరవాత సురేందర్ రెడ్డి సినిమా ఎవరితో అనేది ఇంకా తేలలేదు. వార్తల్లో మాత్రం చాలా పేర్లు వినిపించాయి. అఖిల్ తో గానీ, రామ్ తో గానీ సూరి సినిమా ఖాయం అవ్వొచ్చన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ ట్విస్ట్ వచ్చింది. పవన్ కల్యాణ్ తో సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయడం ఖాయమన్నది ఆ వార్తల సారాంశం. నేల టికెట్ నిర్మాత రామ్ తాళ్లూరి దగ్గర పవన్ ఇది వరకే అడ్వాన్స్ తీసుకున్నాడని, అందుకోసం పలు కథలు విన్నాడని, చివరికి సురేందర్ రెడ్డి కథకు ఓకే చెప్పాడని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడే పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ముందుగా వకీల్ సాబ్ పూర్తవ్వాలి. ఆ తరవాత క్రిష్ సినిమా ఉంది. హరీష్ శంకర్ కూడా ఓ కథ రెడీ చేస్తున్నాడు. ఇవన్నీ అయితే గానీ సురేందర్ రెడ్డి సినిమా మొదలవ్వదు. ఈలోగా సూరి కుదిరితే రెండు సినిమాల్ని పూర్తి చేసుకోవొచ్చు. కాకపోతే సురేందర్ బాగా లేట్. ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. పవన్ ఖాళీ అయ్యేలోగా సూరి ఓ సినిమా అయినా పూర్తి చేస్తాడో, లేదో చూడాలి.