తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి అసిన్ ఆ తరువాతి కాలంలో తమిళ,మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక పోయిన ఏడాది ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు అయిన రాహుల్ శర్మా ని వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు ఈ జంటకి ఒక పండంటి ఆడపిల్ల జన్మించింది. కొద్దిసేపటి క్రితమే ఈ వార్తని అసిన్ తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా ఈ విషయాన్ని తెలియచేసింది.
అసిన్-రాహుల్ కి అత్యంత సన్నిహిత మిత్రుడైన హీరో అక్షయ్ కుమార్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ జంటకి అభినందనలు తెలియచేశాడు.
వివాహం తరువాత సినిమాల నుండి తప్పుకున్న అసిన్ కి ఇప్పుడు తల్లిగా పెద్ద ప్రమోషన్ వచ్చిందనే చెప్పాలి.