ముద్దుగుమ్మ ఇలియానా టాలీవుడ్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించేసి, స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా బిజీ బిజీగా సినిమాలు చేసేసింది. అయితే అక్కడే ఆండ్రూ నీబోన్ అనే కెమెరామేన్‌తో ఇలియానా సఖ్యతగా ఉండడం చూసి, వీరిద్దరి మధ్యనా ఏదో నడుస్తుందనే న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది ఆ మధ్య. అయితే అది ఉత్త న్యూసేం కాదనీ, తమ మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవమేననీ, తామిద్దరం సహజీవనం చేస్తున్నామనీ ఇలియానా చెప్పేసింది. అయితే ఇటీవల మళ్లీ ఇలియానాకి ఆండ్రూతో పెళ్లయిపోయిందనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరో పక్క ఇలియానా కూడా మై బెటర్ హాఫ్, నా జీవిత భాగస్వామి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతోంది. దాంతో ఇలియానాకి పెళ్లయిపోయిందని కన్ఫామ్ చేసుకోక తప్పడం లేదు అభిమానులకి. అయితే గతంలో మేమిద్దరం సహజీవనంలోనే చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రేమకి పెళ్లితో సంబంధం ఏంటి. పెళ్లి చేసుకోకుండానే మేము మా లైఫ్‌ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. పెళ్లితో పనేంటి మాకు అన్నట్లుగా లెక్చర్లు ఇచ్చిన బ్యూటీ ఇలియానా ఇప్పుడు మాట మార్చేసింది. నా జీవిత భాగస్వామి అంటూ ఆండ్రూని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. ఏంటమ్మా ఇది, ఇల్లీ బేబీ ఇంతలోనే అంతలా మాట మార్చేస్తే ఎలాగమ్మా. వాటమ్మా వాట్టూ.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలింతకీ ఇలియానాకి పెళ్లయ్యిందా? లేదా. ఏమో కానీ ఏది ఏమైనా ఈ బ్యూటీ సందడి చూస్తుంటే, మొత్తానికి ఇలియానా ఓ ఇంటిదైపోయినట్లే అనిపిస్తోంది.