ఓ తెలుగు జ్యోతిష్య పండితుడు శ్రీదేవిది సహజం మరణం కాదని చెప్పడం తాజాగా వివాదాస్పదమవుతోంది.
ఈ విషయం గురించి ఇప్పుడు మళ్లీ చర్చ జరుగుతోంది. శ్రీదేవి మరణించింది. దాదాపు అందరూ మర్చిపోయారు ఆ విషయాన్ని. అసలు ఆమెది ఆత్మహత్యా.? హత్యా.? సహజ మరణమా.? అనే విషయాలపై వచ్చిన కామెంట్స్‌ని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశ్యంతో కామ్ అప్ చేశారు. అయితే అంతవరకూ ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి సడెన్‌గా చనిపోవడం, అది కూడా బాత్‌టబ్‌లో పడి మునిగిపోవడం అనే కారణంగా ఆమె మరణించడం అనేది హాస్యాస్పదంగా ఉంది.
ఆ సంగతి పక్కన పెడితే, ఒకవేళ ఆమెది సహజ మరణం కాకుంటే, ఆ మరణానికి కారకులెవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. ఇక ఈ తాజా వివాదాన్ని పరిగణలోనికి తీసుకుంటే, శ్రీదేవిది సహజ మరణం కాదు అని చెప్పిన వ్యక్తి ఓ జ్యోతిష్య పండితుడు. సాధారణ వ్యక్తి ఇలా చెప్పి ఉంటే, అది మరోలా ఉండేది. కానీ ఓ జ్యోతిష్య పండితుడు ఇలా చెప్పడంతో జ్యోతిష్యానికి అవమానం కలుగుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే అసలింతకీ ఈ విషయం ఇప్పుడెందుకు బయటికి వచ్చింది. అయినా ఇది జరిగిపోయిన సంఘటన.
మరణానికి ముందు శ్రీదేవికి ప్రాణగండం ఉందని చెబితే అది వేరు. అలా కాక ఆమె చనిపోయాక, శ్రీదేవిది సహజ మరణం కాదు అని సదరు జ్యోతిష్య పండితుడు చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. చూడాలిక, ఈ తాజా వివాదం ఇంకెన్ని పరిణామాలకు తావిస్తుందో!