ఆవేశంలో ‘రంగస్థలం’ కథ చెప్పేసిన ‘చిరు’

By iQlikMovies - March 19, 2018 - 13:19 PM IST

మరిన్ని వార్తలు

నిన్న వైజాగ్ లో రంగస్థలం చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు అని దర్శకుడు సుకుమార్ ని ప్రశంసలతో ముంచ్చేత్తాడు.

ఇక ఆయన ఈ సినిమాని ఇప్పటికే చూడడం, తనకి బాగా నచ్చడంతో ఓ రకంగా ఉద్వేగంగా ప్రసంగించాడు. అలా ఆ ఆవేశంలో ఈ సినిమాకి సంబందించిన కథని కొద్దిగా చెప్పేశాడు. అందులో ముఖ్యంగా హీరో ఆది పాత్ర చనిపోవడం అలాగే ఆది & రామ్ చరణ్ ఇందులో అన్నదమ్ములుగా నటించడం వంటివి అర్ధమైపోతాయి. 

దీనితో ఊరి ప్రెసిడెంట్ కి ఆదికి మధ్య పోరాటంలో ఆది మరణించడం దానికి రామ్ చరణ్ అలియాస్ చిట్టి బాబు ప్రతీకారం తీర్చుకుంటాడు అని మొత్తం కథ అంటూ ప్రచారం సాగుతున్నది.

సినిమా బాగా నచ్చింది అన్న ఉత్సుకుతతో సినిమాలో కీలకంగా ఉండే అంశాలని చెప్పేయ్యడం ద్వారా ఒకింత కథని చెప్పేసినట్టుగా అయిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS